బుల్లితెర నటిని పొట్టు పొట్టు కొట్టిన భర్త.. రక్తంతో ఉన్న ఫొటో వైరల్?

by Disha Web Desk 8 |
బుల్లితెర నటిని పొట్టు పొట్టు కొట్టిన భర్త.. రక్తంతో ఉన్న ఫొటో వైరల్?
X

దిశ, సినిమా : బుల్లితెర నటి సమీరా షరీఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె చాలా సీరియల్స్‌లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆడపిల్ల సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటి ముద్దుబిడ్డ, భార్యమణి, డాక్టర్ చక్రవర్తి ఇలా చాలా సీరియల్స్‌లో నటించి, టాప్ బుల్లితెర హీరోయిన్‌గా తన సత్తా చాటింది.

అయితే తాజాగా ఈ నటికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? ఈమె ఓ ఫొటోను షేర్ చేస్తూ ఆసక్తికర విషయాలు తమ అభిమానులతో పంచుకుంది. అందులో ఆమె పెదవిపై బ్లడ్ ఉంటుంది. ఎవరో కొట్టడం వలన ఆమెకు గాయం అయినట్లు కనిపిస్తుంది. దానిని షేర్ చేస్తూ.. ఇది జ్ఞాపకం మాత్రమే..దీనిని చూస్తే నేను ఎవరితోనో గొడవ పడినట్లు అనిపిస్తుంటుంది. నా భర్త నాతో దెబ్బలు ఆడినట్లుగా పిక్‌లో కనిపిస్తుంది. కానీ భార్య భర్తలు అన్న తర్వాత ఏదో ఒక విషయంలో గొడవ పడటం చాలా కామన్. కానీ నేను వివాహం చేసుకోక ముందు కూడా నా ఒంటిపై గాయాలు ఉండేవి. నిజానికి అవి నా మేనల్లుడు అయాన్ చేసినవి, కానీ ఆ ఫోటో చూస్తే మాత్రం నేను నా భర్తతో పోట్లాడినట్లు కనిపిస్తుంది. కానీ ఇది అర్హాన్ పొరపాటుతో జరిగింది మాత్రమే.. నేను ఈ ఫోటో షేర్ చేయగానే నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. బుల్లితెర నటి సమీరను తన భర్త చాలా దారుణంగా కొట్టారంటూ,పుకార్లు వచ్చాయి. కానీ ఇది నా అల్లుడు అల్లరితో చేసిన గాయం మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ వార్త మరోసారి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Next Story