- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mr. Bachchan: మిస్టర్ బచ్చన్‌పై నమ్మకం ఉంది: నిర్మాత టీజీ విశ్వప్రసాద్
దిశ, సినిమా: హీరో రవితేజతో వరుసగా సినిమాలు చేయాలనే ప్లాన్‌లో ఉన్నాం. ఆయనతో మాకున్న అనుబంధం అలాంటింది. రవితేజ వన్‌ఆఫ్ ది మోస్ట్ కంఫర్టబుల్ హీరో అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. టాలీవుడ్‌లో ఇప్పుడు కంటిన్యూగా సినిమాలు చేస్తున్న నిర్మాతల్లో ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తాజాగా విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం 'మిస్టర్ బచ్చన్'. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ సినిమాకి హరీశ్ శంకర్ దర్శకుడు. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా విశ్వప్రసాద్ శనివారం మీడియాతో సినిమా విశేషాలని పంచుకున్నారు.
ఆయన మాట్లాడుతూ 'హరీష్ శంకర్, రవితేజ కలయిలో రూపొందిన పూర్తి కమర్షియల్ మాస్ చిత్రమిది. ధమాకా చిత్రానికి రెండింతలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే చిత్రమిది. అన్ని వర్గాల వారు మెచ్చే అంశాలను మేళవించి దర్శకుడు హరీష్‌శంకర్ ఈచిత్రాన్ని కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాడు. రవితేజ పాత్ర ఎంతో కొత్తగా వుంటుంది. కథానాయిక భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంతో క్రేజీ హీరోయిన్‌గా మారిపోతుంది. ఆగస్టు 15న డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ సినిమాలు మాకు పోటీ కాదు. ఎందుకంటే కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు అన్ని సినిమాలను సక్సెస్ చేస్తారు. మా కంటెంట్‌పై మాకు నమ్మకం ఉంది. మా బ్యానర్‌లో ప్రస్తుతం రాజాసాబ్, మిరాయ్, గూడాచారి-2, సన్నీడియోల్‌తో హిందీ మూవీ జరుగుతున్నాయి. కన్నడలో గణేష్ అనే యాక్టర్‌తో 50 కోట్ల స్పాన్ ఉన్న మూవీ చేస్తున్నాం. ఇంకో మూడు కన్నడ సినిమాలు కూడా సెట్స్ మీద ఉన్నాయి.. విశ్వక్ సేన్, అనుదీప్ మూవీలతో పాటు ఈ ఏడాది మొదలయ్యే ఇంకొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా యూఎస్‌లో రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నాం' అన్నారు.