- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏంది సామీ ఇది సినిమా పాటనా లేక లిరిల్ సోప్ యాడా? ఎన్టీఆర్ దేవరపై భారీ విమర్శలు.. (ట్రోలింగ్ వీడియో)
దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న 'దేవర ' నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. దేవర ముందర నువ్వెంత అని సాగిన పాటకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక తాజాగా సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రొమాంటిక్ సాంగ్ లో హీరోయిన్ జాన్వీ కపూర్, ఎన్టీఆర్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ ఔట్ అయింది. కానీ విజువల్స్, మ్యూజిక్ వి షయంలో ట్రోల్స్ తప్పలేదు.
ముఖ్యంగా ఈ పాటకు సంగీతం సమకూర్చిన అనిరుధ్ కాపీ పేస్ట్ చేశాడనే విమర్శలు వచ్చాయి. ఇక కొరియోగ్రఫీ విషయంలోనూ ఓ లెవల్ లో నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అయితే పాట లిరిల్ సోప్ యాడ్ లాగా ఉందంటూ.. సాంగ్ ఎడిట్ చేసి పోస్ట్ చేయగా వైరల్ అయిపోయింది. ఇక దీనిపై స్పందిస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఇలాంటి హెల్తీ ట్రోల్స్ చేస్తే యాక్సెప్ట్ చేస్తామని, ఎంకరేజ్ కూడా చేయగలమని సపోర్ట్ చేస్తున్నారు. శృతి మించిన గలీజ్ ట్రోల్స్ మాత్రం అస్సలు ఒప్పుకునేది లేదని అంటున్నారు. ఇక నెటిజన్లు.. ఫ్యాన్ వార్స్ కు బదులు ఇలా ఆరోగ్యకరమైన విమర్శలు బెటర్ అని సూచిస్తున్నారు.