వైట్ డ్రెస్‌లో త్రిప్తి డిమ్రి స్టన్నింగ్ స్టిల్స్.. వెయిట్ చేయలేకపోతున్నానంటూ పోస్ట్

by Hamsa |   ( Updated:2024-07-17 11:36:39.0  )
వైట్ డ్రెస్‌లో త్రిప్తి డిమ్రి స్టన్నింగ్ స్టిల్స్.. వెయిట్ చేయలేకపోతున్నానంటూ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించినప్పటికీ రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటించిన ‘యానిమల్’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇందులో ఈ అమ్మడు బోల్డ్ సీన్స్ చేసి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. అలాగే బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది. ప్రజెంట్ ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్‌తో ‘బ్యాడ్ న్యూజ్’ అనే మూవీలో నటిస్తుంది. ఈ మూవీ జూలై 19న రిలీజ్ కానుంది.

ఈ క్రమంలో.. త్రిప్తి ప్రమోషన్స్‌లో భాగంగా వరుస పోస్టులతో నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా, ఈ బ్యూటీ ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో వైట్ కలర్ డ్రెస్స్‌లో స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చి కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తోంది. మత్తేక్కించే చూపులతో మంత్ర ముగ్ధులను చేస్తుంది. అలాగే ‘‘మీరందరూ సలోని బగ్గాను కలిసే వరకు.. నేను వేచి ఉండలేను. బ్యాడ్ న్యూజ్ జూలై 19న విడుదల కాబోతుంది’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఈ ఫొటోలు చూసిన వారంతా బ్యూటీఫుల్, గార్జియస్ అని పొగుడుతున్నారు.

(Video Link Credits To Tripti Dimri Instagram Channel)

Advertisement

Next Story