‘నాకు ఆ విషయాలపై అవగాహన లేదు’.. యానిమల్ సీక్వెల్‌పై త్రిప్తి షాకింగ్ కామెంట్స్

by Anjali |
‘నాకు ఆ విషయాలపై అవగాహన లేదు’.. యానిమల్ సీక్వెల్‌పై త్రిప్తి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: 2017 లో పోస్టర్ బాయ్స్ చిత్రంతో సినీఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ త్రిప్తి డిమ్రి. తర్వాత రొమాంటిక్ డ్రామాగా వచ్చిన లైలా మజ్ను లో కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. త్రిప్తి 2021 లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో కూడా చోటు సంపాదించుకుంది. రెడిఫ్ డాట్ కామ్ 2020 నటీమణుల జాబితాలో ఈ బ్యూటీ ఎనిమిదవ ప్లేస్‌లో ఉంది. 2020లో ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల్లో వెబ్ ఒరిజినల్ ఫిల్మ్‌లో ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. ఇక సందీప్ రెడ్డి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే యువతను పిచ్చోళ్లను చేసింది. బోల్డ్‌గా దర్శనమిచ్చి కుర్రాళ్ల హార్ట్ కొల్లగొట్టింది. ఇకపోతే తాజాగా త్రిప్తి డిమ్రి ఓ ఇంటర్వ్యూలో హాజరై పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.

‘‘యానిమల్ సినిమా వల్లనే నాకు ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. ఈ మూవీ నా కెరీర్‌కు చాలా ఉపయోగపడుతోంది. రణబీర్‌, రష్మిక లాటి గొప్ప నటులో కలిసి నటించినందుకు హ్యాపీగా ఉంది. ఆ మూవీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. నాపై వచ్చిన పలు విమర్శలను కూడా పాజిటివ్ గా తీసుకున్నాను. సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్. అయితే అందరూ యానిమల్ సీక్వెల్ ఎప్పుడు ప్రారంభమవుతుందని అడుగుతున్నారు. సీక్వెల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కథ ఎప్పుడు స్టార్ అవుతుందనే విషయాలనై నాకు అవగాహన లేదు’’ అని త్రిప్తి డిమ్రి ఇంటర్వ్యలో చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story