ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

by Anjali |   ( Updated:2023-10-13 11:07:20.0  )
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో ఇటీవల వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. రీసెంట్‌గా బడా నిర్మాత దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి అనారోగ్య సమస్యలతో ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆ ఘటన మరవకముందే.. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి భైరవి వైద్య (67) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె ఈ నెల 8 వ తేదీన తుదిశ్వాస విడిచారని భైరవి కూతురు జానకి వైద్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఈ నటి నాలుగు దశాబ్దాలుగా సినిమా, టీవీ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. బాలీవుడ్‌లో అనిల్ కపూర్, ఐశ్వర్యరాయ్ మూవీ తాల్, సల్మాన్‌తో చోరీ చోరీ చుప్కే చుప్కేలో ముఖ్య పాత్రలో నటించారు. అలాగే బుల్లితెరపై హస్రతీన్, మహిసాగర్ వంటి షోల్లో కూడా పనిచేశారు.

Advertisement

Next Story

Most Viewed