- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
20 ఏళ్ల తర్వాత కలిసిన టాలీవుడ్ సూపర్ జోడి.. కొన్ని జ్ఞాపకాలు కాల పరీక్షాగా నిలుస్తాయంటూ హీరోయిన్ పోస్ట్
దిశ, సినిమా: 2002లో వచ్చిన నాగార్జున సినిమా ‘మన్మధుడు’ అందరికీ గుర్తుండే ఉంటుంది. త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన ఈ మూవీకి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు. అప్పట్లో ఈ చిత్రం ఎంత సూపర్ సక్సెస్‌ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో సోనాలి బింద్రేతో పాటు అన్షు కూడా హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అందులోని తన అందంతో, యాక్టింగ్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ అమ్మడు.
ఇక మన్మధుడు సినిమాతోనే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అన్షుకు.. మొదటి సినిమా సక్సెస్‌తో వరుస అవకాశాలు వచ్చాయి. తర్వాత ఏం జరిగిందో తెలియదు ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. దాదాపు 21 ఏళ్ల తర్వాత తెలుగు మట్టిపై కాలు పెట్టిన అన్షు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ అమ్మడు తాజాగా హీరో నాగార్జునను కలిసింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ‘రెండు దశాబ్దాల క్రితం, నేను నాగ్‌తో మన్మధుడు తీశాను. ఇన్నాళ్ల తర్వాత ఆయనతో మళ్లీ కలవడం చాలా సంతోషంగా ఉంది. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అదే ఉత్సాహంగా ఉన్నారు. కొన్ని జ్ఞాపకాలు నిజంగా కాల పరీక్షగా నిలుస్తాయి. *మన్మధుడు*అప్పుడు ఇప్పుడు*అభిమాహి’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది అన్షు. కాగా.. అప్పట్లో మన్మధుడు సినిమాలో నాగార్జున, అన్షు జోడికి మంచి క్రేజ్ వచ్చింది.