నేడు అందాల తార సోనియా అగర్వాల్ పుట్టిన రోజు..

by Hamsa |   ( Updated:2023-03-28 06:25:53.0  )
నేడు అందాల తార సోనియా అగర్వాల్ పుట్టిన రోజు..
X

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ హీరోయిన్ సోనియా అగర్వాల్ పలు తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే తెలుగులో విన్నర్, రెడ్, అయోగ్యా వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషించి తన అందంతో పాపులారిటీని దక్కించుకుంది. సోనీయా అగర్వాల్ మార్చి 28న 1982లో చండీగఢ్‌లో సీమా అగర్వాల్, అశోక్ నావల్‌ దంపతులకు జన్మించింది. సోనియా మాతృభాష పంజాబీ. డిసెంబరు 2006లో తమిళ దర్శకుడు అయిన సెల్వరాఘవన్‌ను సోనియా వివాహం చేసుకుంది. ఆమె వివాహం తర్వాత నటనకు గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత వీరిద్దరు 2010లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సోనియా సినిమాల్లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసి వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది.

Read more:

Anu Emmanuel: హ్యాపీ బర్త్ డే అను ఇమ్మాన్యుయేల్

Advertisement

Next Story

Most Viewed