నేడు సీనియర్ హీరోయిన్ Raasi పుట్టిన రోజు

by Prasanna |   ( Updated:2023-07-29 06:52:09.0  )
నేడు సీనియర్ హీరోయిన్ Raasi పుట్టిన రోజు
X

దిశ, వెబ్ డెస్క్: రాశి 1980,జూలై 29 న మద్రాసులో పుట్టి పెరిగింది. ఈమె స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా. రాశి అసలు పేరు మంత్ర. ఈ ముద్దుగుమ్మ తన ఐదో యేటలో హిందీ మూవీలో బాల నటిగా పరిచయమైంది. ముఖ్యంగా కన్నడ, హిందీ భాషలతో పాటు తెలుగులో నటించింది. రాశి హీరోయిన్ గా తన మొదటి సినిమా తమిళంలో చేసింది. కానీ ఈ సినిమా హిట్ అవ్వకపోవడంతో అవకాశాలు రాలేదు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించిన సినిమా తెలుగులో రీమేక్ చేసిన శుభాకాంక్షలు సినిమాలో రాశి నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస అవకాశాలతో దూసుకెళ్లింది. ప్రస్తుతం రాశి 'జానకి కలగనలేదు' తెలుగు సీరియల్లో నటిస్తుంది. నేడు తన 43 వ పుట్టిన రోజును జరుపుకుంటుంది.

Also Read: ‘BRO’ సినిమాలో ఏపీ సీఎంను టార్గెట్ చేసిన Pawan Kalyan..! వైరల్ అవుతున్న మూవీ క్లిప్స్

Advertisement

Next Story