- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండస్ట్రీలో నిలవాలంటే గ్లామర్ షో చేస్తే చాలు.. నిధి అగర్వాల్ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, సినిమా: తెలుగులో నటించింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ మంచి స్టార్ డమ్ సంపాదించుకుంది బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'హరిహర వీరమల్లు'లో నటిస్తున్న ఆమె.. కేవలం తెలుగులోనే కాకుండా అటు తమిళంలోనూ అవకాశాలు అందుకుంటోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి.. ఇండస్ట్రీ, కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'ఇండస్ట్రీలో టాలెంట్ చూసి అవకాశాలు ఇచ్చే వారు చాలా తక్కువ. అందరూ హీరోయిన్లు అందంగా ఉన్నారా ? లేదా ? అనే చూస్తారు. రాబోయే రోజులో హీరోయిన్ల పని సినిమాల్లో గ్లామర్ షో చేయడమే. అది చూడటానికే ప్రేక్షకులు థియేటర్లలోకి వచ్చేది. అందుకే నేను గ్లామర్ షో చేయడానికి వెనుకాడను. నో చెప్పను. పెద్ద హీరోల సినిమాల్లో అవకాశం వస్తే రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేయను. వాళ్లు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. లేదంటే నా మినిమమ్ అమౌంట్ ఇదే అని చెప్పేస్తాను. ఎందుకంటే పెద్ద హీరోతో ముందు సినిమా చేస్తే ఆ తర్వాత అవకాశాలు వాటంతట అవే తప్పకుండా వస్తాయని నాకు తెలుసు' అంటూ చెప్పుకొచ్చింది.