Chammak Chandra : కడుపు నిండాలంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భరించాలి Emotional video

by Dishaweb |   ( Updated:2023-08-20 17:01:49.0  )
Chammak Chandra : కడుపు నిండాలంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భరించాలి Emotional video
X

దిశ, సినిమా: ఈ పది సంవత్సరాల కాలంలో ఎంతో మంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చింది ‘జబర్దస్త్’ షో. ప్రారంభం నుంచి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నా ఈ షో బెస్ట్ కమెడియన్లలో చమ్మక్ చంద్ర ఒక్కడు. ఎప్పుడూ తన స్కిట్‌లో మహిళలపై కామెడీ చేస్తూ, తన పంచ్ డైలాగ్స్‌తో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం పలు షోలు, ప్రోగ్రామ్స్, ఈవెంట్స్, సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు. అయితే ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాలు తెర వెనకాల చాలా భయంకరంగా ఉంటాయి. గుర్తింపు పొందడం కోసం.. ఛాన్స్‌ల కోసం చాలా కష్టాలుపడి ఉంటారు. కాగా రీసెంట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్ర కూడా తన లైఫ్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు. ‘చిన్నప్పటి నుంచే నా తండ్రితోపాటు, కట్టెలు అమ్ముకొని ఇంట్లోకి బియ్యం కొనుక్కొని వచ్చేవాడిని.

ఇక ఏదో ఒక పని చేసుకుందామనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చా. కానీ ఇక్కడ చాలా కష్టాలు పడ్డా. ఇంట్లో ఒక్క రూపాయి కూడా అడగకుండా ఉద్యోగం చేసి ఆ డబ్బులతోనే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యా. అక్కడే ధన్‌రాజ్‌ను కలిశాను. నేను చేరిన ఇన్‌స్టిట్యూట్‌లో ధన్‌రాజ్.. అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ఇండస్ట్రీలో నాకు పరిచయమైన మొదటి స్నేహితుడు అతనే. ఒంటరిగా కష్టపడి ఎదిగానని, చిన్న చిన్న పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకున్నాని అన్నాడు. దీంతో ఇక ఏం జరిగినా భరించాలని నిర్ణయించుకున్నా, అందుకే ఇప్పుడు ఈ స్థాయిలో ఉండగలిగాను’ అంటూ చెప్పుకొచ్చాడు చమ్మక్ చంద్ర.

ఇవి కూడా చదవండి : లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న యంగ్ హీరో.. ఫొటోలు వైరల్

Advertisement

Next Story