Dulquer Salmaan: ‘లక్కీ భాస్కర్’ చిత్రం నుంచి టైటిల్ ట్రాక్‌ రిలీజ్..

by sudharani |
Dulquer Salmaan: ‘లక్కీ భాస్కర్’ చిత్రం నుంచి టైటిల్ ట్రాక్‌ రిలీజ్..
X

దిశ, సినిమా: వివిధ భాషలలో సినిమాలు చేస్తూ, దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్.. ప్రజెంట్ "లక్కీ భాస్కర్" చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇందులో నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచగా.. తాజాగా టైటిల్ ట్రాక్‌ విడుదలైంది.

దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సంద‌ర్భంగా ‘లక్కీ భాస్కర్’ నుంచి టైటిల్ ట్రాక్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. "శభాష్ సోదరా.. కాలరెత్తి తిరగరా.. కరెన్సీ దేవి నిను వరించెరా" అంటూ సాగే ఈ గీతం ప్రేక్షకులను మైమరపిస్తుంది. కాగా.. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ‘లక్కీ భాస్కర్’ తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.

Advertisement

Next Story