‘పుష్ప-2’ సెకండ్ సాంగ్‌కు టైమ్ ఫిక్స్.. అదిరిపోయే పోస్టర్ వదిలిన శ్రీవల్లి

by Hamsa |
‘పుష్ప-2’ సెకండ్ సాంగ్‌కు టైమ్ ఫిక్స్.. అదిరిపోయే పోస్టర్ వదిలిన శ్రీవల్లి
X

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో పుష్ప-2 పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. 2021లో వచ్చిన పుష్ప సినిమాకు సిక్వెల్‌గా రాబోతుంది. ఇందులో హీరోయిన్‌గా రష్మిక, విలన్ ఫహద్ ఫాజల్ కనిపించనున్నాడు. అయితే ఇప్పటికే పుష్ప-2 నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా ఇటీవల వచ్చిన సూసేకి అగ్గి రవ్వ మాదిరి సాంగ్ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేసింది.

తాజాగా, పుష్ప-2 సెకండ్ సాంగ్ ఫుల్ వీడియోకు టైమ్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని తెలుపుతూ రష్మిక మందన్నా ఓ స్పెషల్ పోస్టర్‌ను వదిలింది. అల్లు అర్జున్‌తో కలిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ పుష్ప-2 సూసేకి సాంగ్ మే 29న ఉదయం 11. 07 నిమిషాలకు రానున్నట్లు వెల్లడించింది. అలాగే మీ పుష్పతో శ్రీవల్లీ అనే క్యాప్షన్ జత చేసింది. అయితే రష్మిక షేర్ చేసిన పోస్టర్‌లో అల్లు అర్జున్‌ ఎదపై రష్మిక సంతోషంగా వాలినట్లు ఉంది. ప్రస్తుతం ఈ పిక్ అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా పుష్ప-2 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.



Next Story