శ్రీలీల ఏం తింటుంది.. యంగ్ సెన్సేషనల్ బ్యూటీ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే?

by Anjali |   ( Updated:2024-02-08 08:13:43.0  )
శ్రీలీల ఏం తింటుంది.. యంగ్ సెన్సేషనల్ బ్యూటీ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే?
X

దిశ, సినిమా: యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే ముందుగా శ్రీలీల పేరే వినిపిస్తుంది. ఇండస్ట్రీకి ఏ సమయంలో అడుగుపెట్టిందో గానీ ఈ అమ్మడుకు బాగా కలిసి వస్తుంది. ఏకంగా సీనియర్ అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసిందంటే శ్రీలీల టాలెంట్‌కు, నటనకు.. ముఖ్యంగా అదిరిపోయే డాన్స్‌ను మొక్కాలి. ఈ బ్యూటీ వేసే ఒక్కో స్టెప్‌కు దిమ్మతిరిగిపోవాల్సింది అంతే.

రీసెంట్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంలో ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌కు ఏ రేంజ్‌లో స్టెప్పులేసి బాక్సాఫీసును షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అతి తక్కువ సమయంలో అండ్ అతి చిన్న వయసులో ఇంతటి గుర్తింపు దక్కించుకోవడం రియల్లీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ అమ్మడు ఫిజిక్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. కాగా శ్రీలీల ఈ బాడీని ఎలా మెయింటైన్ చేస్తోంది? ఇంతకీ తను ఏం తింటుంది? తన ఫిట్నెస్‌కు సీక్రెట్ ఏంటి అంటూ నెట్టింట జనాలు ఆరా తీస్తున్నారు.

అయితే శ్రీలీల తన ఫిజికల్, మెంటల్ హెల్త్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుందట. ఇందుకోసం ఈ అమ్మడు ప్రతి రోజూ నైట్ 45 నిమిషాలు తప్పకుండా యోగా చేస్తుందట. సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వర్కౌట్స్ చేయడం మాత్రం పక్కన పెట్టదట. వెయిట్ లిఫ్టింగ్, థ్రెడ్ మిల్ రన్నింగ్ ఇలా ఏ ఒక్కటి కూడా ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా చేస్తుందట. మజిల్ స్ట్రెంత్ కోసం, బాడీ టోన్డ్ గా ఉండేందుకు ఎక్కువగా బెంచ్ ప్రెస్సెస్, డెడ్ లిఫ్ట్స్, స్క్వాట్స్ లాంటివి చేస్తుందట.

ప్రతి రోజూ మార్నింగ్ తప్పకుండా కొబ్బరి వాటర్ తాగుతుందట. లోఫ్యాట్ జ్యూస్‌.. ఆ తర్వాత వెజిటేబుల్ సాండ్విచ్ తింటుందట. అలాగే ఏదైనా ఒక ఫ్రూట్.. గ్లాస్ సలాడ్ బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకుంటుందట. మధ్యాహ్నం లంచ్‌.. సలాడ్స్, బ్రౌన్ రైస్, కూరగాయలు, పప్పు తింటుందట. సాయంత్రం కాఫీ.. ఇక నైట్ వెజిటేబుల్ సూప్ ఏదైనా సలాడ్ తీసుకుంటుందట. బాడీ ఎక్కువగా డీ హైడ్రేటెడ్‌గా ఉండేందుకు నిమ్మకాయ వాటర్ ఎక్కువగా తాగుంటుందట.

Advertisement

Next Story

Most Viewed