Yogi Adityanath కాళ్లు మొక్కడంపై Rajinikanth రియాక్షన్ ఇదే!

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-22 04:46:34.0  )
Yogi Adityanath కాళ్లు మొక్కడంపై Rajinikanth రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘జైలర్’ మూవీతో భారీ హిట్ కొట్టిన సూపర్ స్టార్ రజినీకాంత్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో రజినీ హిమాలయాలకు వెళ్లారు. అక్కడి నుంచి పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ ను రజినీ కలిశారు. లక్కోలో సీఎం ఇంటి ముందు కారులోంచి దిగి వెళ్లి యోగి కాళ్లు మొక్కారు. అయితే వయసులో 20 ఏళ్లు చిన్నావాడైనా యోగి కాళ్లు రజినీ మొక్కడంపై సోషల్ మీడియాలో చర్చ సాగింది.

కొంత మంది రజినీ కాంత్ ను ట్రోల్ కూడా చేశారు. ఇదే విషయంపై రజినీకాంత్ స్పందించారు. తన డివోషనల్ ట్రిప్ ముగియగానే చెన్నై ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమైన రజినీని అక్కడి ఓ రిపోర్టర్ యోగి కాళ్లు మొక్కడంపై ప్రశ్నించారు. దీనిపై రజినీ మాట్లాడుతూ.. ‘తనకంటే చిన్నవారైనా యోగి, స్వామిజీ అయితే వారి కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకోవడం నా పద్ధతి’ అని క్లారిటీ ఇచ్చారు. ఇక, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story