థియేటర్లలో దసరా సందడి.. మూవీలో ప్లస్‌లు, మైనస్‌లు ఇవే?

by samatah |   ( Updated:2023-03-30 07:56:52.0  )
థియేటర్లలో దసరా సందడి.. మూవీలో ప్లస్‌లు, మైనస్‌లు ఇవే?
X

దిశ, వెబ్‌డెస్క్ : శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, నాని హీరోగా, కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నేడువిడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా దసరా. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది. నాని అభిమానులు ఈమూవీ ఎప్పుడు విడుదలవుతుందో అని ఎదురు చూశారు. అనుకున్నట్లుగానే నుడు మూవీ రిలీజై, ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో నాని పాన్ ఇండియా హీరోగా పరిచయం అయ్యాడు. ఇక పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా, ప్లస్‌లు, మైనస్‌లు ఏంటో చూసేద్దాం.

ప్లస్ పాయింట్స్

నాని, కీర్తీ సురేష్ తమ నటనతో అద్భుతంగా ఆకట్టుకున్నారంట.నిమాలో ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ సీన్స్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటాయంట. ముఖ్యంగా సినిమూ క్లైమాక్స్ గురించి ఎక్కువగా వినిపిస్తుంది.క్లైమాక్స్ కోసమే సినిమా టికెట్ కొనచ్చు అని, క్లైమాక్స్ పై ఎక్కువ ప్రశంసలు అందుతున్నాయి. అలాగే ఇక సినిమా ఫ‌స్టాఫ్ బాగుంద‌ని ఇంట‌ర్వెల్ బ్యాంగ్ అని చెబుతున్నారు. ఇక ద‌ర్శ‌కుడికి ఇది మొద‌టి సినిమా అయిన‌ప్ప‌టికీ టెక్నిక‌ల్ వ్యాల్యూల్స్ ఫైట్స్ సీన్ లు ఇలా ఎక్క‌డా కూడా త‌గ్గ‌లేద‌ంట.

మైనస్ పాయింట్స్

కథ అంత గొప్పగా లేదని టాక్, అంతే కాకుండా భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు బీజీఎం గొప్ప‌గా ఇవ్వ‌లేద‌ని కూడా నెటిజ‌న్ లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇవి కూడా చదవండి: యూఎస్‌లో ‘దసరా’ రెస్పాన్స్ అదుర్స్ !

Advertisement

Next Story