ఇప్పటికి మధ్యతరగతి అమ్మాయిలాగే జీవిస్తోన్న స్టార్ హీరోయిన్..!

by Anjali |   ( Updated:2023-04-24 12:39:18.0  )
ఇప్పటికి మధ్యతరగతి అమ్మాయిలాగే జీవిస్తోన్న స్టార్ హీరోయిన్..!
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్రహీరోల సరసన నటించి.. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. ప్రస్తుతం ఈ నటి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్’ చిత్రంలో నటిస్తున్నారు. అయితే తాజాగా కృతి ఓ ఇంటర్వ్యూకు హాజరై.. తన గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. ‘‘ నేను పరిశ్రమలో స్టార్ నటిగా పేరు సంపాదించుకుంటున్నప్పటికీ, మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన విషయాన్ని అస్సలు మర్చిపోను. కుటుంబం విలువలను, మూలాలను ఎప్పటికీ మరవలేను.

అలాగే మనం ఏలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. మనకు తోడుగా ఉండే మిత్రులను కూడా. నా జయాపజయాలతో సంబంధం లేకుండా నా ఫ్రెండ్స్ నన్ను చాలా ఇష్టపడుతారు. నేను సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా తప్పకుండా వారితో ఫోన్‌లో మాట్లాడుతుంటా. అలాంటి గొప్ప హృదయం ఉన్న స్నేహితులను విడిచిపెట్టను.. అంటూ ఈ హీరోయిన్ వెల్లడించారు. ప్రస్తుతం కృతి సనన్ మాట్లాడిన మధ్యతరగతి విలువల పట్ల తనకు ఉన్న గౌరవాన్ని చూసి నెటిజన్లు ‘‘ మీరు గ్రేట్ మేడమ్ అంటూ’’ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

Also Read..

ఓవర్సీస్‌లో విడుదలకు సోలోగానే 'ఆదిపురుష్'

Advertisement

Next Story

Most Viewed