- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Golden Globe Awards ఈవెంట్‌కు హాజరవుతున్న 'RRR' Team!
దిశ, సినిమా : ఎస్.ఎస్.రాజమౌలి, ఎన్‌టీఆర్, రామ్ చరణ్ కలయికలో వచ్చిన మల్టీస్టారర్ మూవీ 'ఆర్ఆర్ఆర్' ఇప్పటికే అనేక అవార్డులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కు బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో 'ఆర్ఆర్ఆర్', బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ కింద 'నాటు నాటు' నామినేట్ అయ్యాయి. కాగా లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి చెర్రీ, రాజమౌళి, తారక్ హాజరుకానున్నారు.
అయితే ఇందుకు సంబంధించిన ఈవెంట్‌కు హాజరయ్యేందుకు రెడీ అయిన ఫొటోలను చరణ్ నెట్టింట షేర్ చేయగా అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. ఇక ప్రతి ఏడాది ప్రెస్టీజియస్‌గా జరిగే ఆస్కార్ అవార్డులకు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ను కర్టన్ రైజర్‌గా పరిగణనలోకి తీసుకుంటారు. ఈసారి కూడా గ్రాండ్‌గా జరగబోయే 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో 'ఆర్ఆర్ఆర్' టీమ్‌తో పాటు సినీ తారా లోకం హాజరై ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.
ఇవి కూడా చదవండి : వివాదంలో మెగాస్టార్ చిరంజీవి.. నవరంధ్రాలు మూసుకున్నాడని ట్రోల్స్ !