వామ్మో.. మహేష్ బాబు ధరించిన టీషర్ట్ ధర ఇన్ని లక్షలా?

by Anjali |   ( Updated:2023-11-08 10:39:20.0  )
వామ్మో.. మహేష్ బాబు ధరించిన టీషర్ట్ ధర ఇన్ని లక్షలా?
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించి వార్త ఏదైనా సోషల్ మీడియాలో జనాలు పెద్ద ఎత్తున వైరల్ చేస్తుంటారు. హీరో, హీరోయిన్లు ధరించిన వాచ్‌లు కానీ, దుస్తులు.. వాటి కాస్ట్‌ గురించి కానీ నెట్టింట జోరుగా చర్చించుకుంటారు. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్దోడు, చిన్నోడు తెగ సందడి చేశారు. ఇక వెంకీతో కలిసి ఉన్న ఫోటోను సూపర్ స్టార్ తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. దీంతో మహేష్ బాబు అభిమానులు ఆ ఫొటోను పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.

అందులో మహేష్ ఆరెంజ్ కలర్ స్వెట్ షర్ట్‌లో చాలా హ్యాండ్సమ్‌గా, స్టైలిష్‌గా కనిపించారు. దీంతో జనాలు సూపర్ స్టార్ షర్ట్ ధర గురించి నెట్టింట చర్చించడం మొదలుపెట్టారు. మహేష్ వేసుకున్న హీర్మేస్ స్వెట్‌షర్ట్‌ ధర ఏకంగా రూ. 1,21,330 ఉంటుందని సమాచారం. ఈ షర్ట్ కాస్ట్ తెలుసుకున్న మహేష్ బాబు ఫ్యాన్స్ వామ్మో ఇంత సింపుల్ టీ షర్ట్‌కు అంత ధరనా? అంటూ నోరెళ్లబెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed