అసభ్యకరంగా హీరోయిన్స్ ఫొటోలు మార్ఫింగ్.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

by Satheesh |   ( Updated:2022-11-26 15:09:50.0  )
అసభ్యకరంగా హీరోయిన్స్ ఫొటోలు మార్ఫింగ్.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా వేదికగా హీరోయిన్స్‌పై అసభ్యకర కామెంట్స్ చేస్తోన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పండరిగా పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా వేదికగా పండరి హీరోయిన్స్‌పై అసభ్యకర కామెంట్లు చేస్తున్నట్లు తెలిపారు. సినీ పరిశ్రమలోని అగ్ర హీరోయిన్స్‌ను టార్గెట్ చేస్తూ పండరి మెసేజ్‌లు చేస్తున్నాడని పేర్కొన్నారు. అంతేకాకుండా హీరోయిన్స్ ఫొటోలు అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, కొద్ది రోజుల క్రితం తమపై అసభ్యకర కామెంట్లు చేయడంతో పాటు ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారని పలువురు హీరోయిన్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. హీరోయిన్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు పండరిని నిండితుడిగా గుర్తించి.. అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

READ MORE

అగ్ర హీరోయిన్లే టార్గెట్.. ఫొటో, వీడియోలు చూస్తే చాలు వెంటనే..!

Advertisement

Next Story