- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నాతో పడుకుంటావా..’ అంటూ చిన్మయికి మెసేజ్.. ఘాటుగా స్పందించిన సింగర్
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదట ఆమె సినిమాల్లో సమంతకు డబ్బింగ్ చెబుతూనే పలు పాటలు కూడా పాడింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతుంటుంది. నిత్యం ఏదో ఒక సంఘటన గురించి స్పందిస్తూ పలు ఆసక్తికర పోస్టులు షేర్ చేస్తుంది.
తాజాగా, చిన్మయికి సోషల్ మీడియాలో ఓ చేదు అనుభవం ఎదురైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నెటిజన్ ఆమెకు మెసేజ్ చేశాడట. దీనికి ఆమె స్పందించకపోవడంతో దారుణమైన ప్రశ్న వేశాడు. ‘మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు అమ్మాయిల కోసం నిలబడిన తీరు నాకు చాలా ఇష్టం. మా సిస్టర్‌కి కూడా అలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. దానికి చిన్మయి రిప్లై ఇవ్వకపోవడంతో అతని నీచమైన బుద్దిని బయటపెట్టాడు.
‘ఎంత కావాలంటే అంత ఇస్తాను.. నాతో పడుకుంటావా.. నిన్ను బాగా సుఖ పెడతాను’ అంటూ పిచ్చిపిచ్చి మెసేజ్‌లు చేశాడు. తాజాగా, దీనిపై చిన్మయి ఘాటుగా స్పందించింది. ‘వీన్ని చూడండి.. ముందు నాకు పద్ధతిగా మెసేజ్‌లు చేశాడు. నేను రిప్లై ఇవ్వక పోయేసరికి వాడి ఇగో హర్ట్ అయినట్టుంది. వాడి నిజస్వరూపాన్ని బయటపెట్టేశాడు. ఇలాంటి వాడిని వాళ్ల నాన్న చెత్తలో పెంచేశాడు చెత్త నా కొడుకు’ అంటూ చిన్మయి ఫైర్ అయింది. ఇలాంటి వారు చాలామంది సమాజంలో ఉన్నారు. అమ్మాయిలు కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ చిన్మయి అందరికీ సలహా ఇచ్చింది. ప్రస్తుతం చిన్మయి ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. ప్రస్తుతం చిన్మయి పెట్టిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
- Tags
- Chinmayi