నీ భర్త పేరేంటి.. నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన దీప్తి సునైనా!

by Anjali |   ( Updated:2023-08-09 05:49:46.0  )
నీ భర్త పేరేంటి.. నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన దీప్తి సునైనా!
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యం హాట్ ఫొటో షూట్లతో యువతను ఆకట్టుకుంటుంది దీప్తి సునైనా. టిక్‌టాక్‌, డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ.. తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ ఏకంగా నాగార్జున హూస్ట్‌గా నిర్వహించే బిగ్‌బాస్‌లో కూడా అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం యూట్యూబ్‌లలో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇక దీప్తి.. షణ్ముఖ్ జశ్వంత్‌తో కొన్నాళ్లు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

ఏమైందో తెలియదు కానీ గతేడాదే వీరిద్దరు విడిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే తాజాగా ఈ భామ తన ఫాలోవర్స్‌తో నెట్టింట ముచ్చటించింది. అందులో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఓ నెటిజన్ దీప్తిని.. మీ భర్త పేరేంటి? అని అడిగాడు. దీంతో వెంటనే తను స్పందించి.. ‘‘మా ఆయన’’ అంటూ బదులిచ్చింది. ఇక ఆ నెటిజన్ మళ్లీ ఎదురు ప్రశ్న వేయ్యకుండా నోరు మూయించింది. ప్రస్తుతం దీప్తి సునైనా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Deepthi Sunaina: గ్లామర్ డాల్ దీప్తి సునైనా సోకుల విందు..

Advertisement

Next Story