- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమంతపై రూమర్స్‌కు చెక్ పెట్టిన మేనేజర్
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతపై నెట్టింట రూమర్స్ హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉండే కొద్ది రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉండటమే ఇందుకు కారణం. ఇక సినిమా ఫంక్షన్స్‌తో పాటు యాడ్ షూట్స్‌లోనూ కనిపించకపోవడంతో ఆమె అనారోగ్యానికి గురైందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమెకు అరుదైన చర్మ వ్యాధి వచ్చిందని, ట్రీట్‌మెంట్ కోసం అమెరికా వెళ్లేందుకు సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. పైగా సామ్ కూడా స్పందించకపోవడం అనుమానాలకు బలం చేకూర్చింది. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన మేనేజర్ మహేంద్ర.. ఆమెపై వస్తున్న పుకార్లను కొట్టిపారేశాడు. సామ్ ఆరోగ్యంగా ఉందని, దయచేసి పుకార్లను నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతానికి తన అమెరికా పర్యటనలో ఉందని స్పష్టం చేశాడు. అయితే సామ్ యూఎస్ ట్రిప్ వెనుకున్న కారణాలు మాత్రం తెలియలేదు.