గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చిన హీరోయిన్.. వరుడు ఎవరంటే? (పోస్ట్)

by Hamsa |
గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చిన హీరోయిన్.. వరుడు ఎవరంటే? (పోస్ట్)
X

దిశ, సినిమా: ఇటీవల కాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయిపోతున్నారు. అయితే వివాహ బంధంలోకి అడుగుపెట్టి పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా, మరో హీరోయిన్ పెళ్లి చేసుకుని షాకిచ్చింది. మలయాళ బ్యూటీ మీరా నందన్, యూకేకి చెందిన శ్రీజు చార్టెడ్ అకౌంటెంట్‌ను సింపుల్‌గా గురువాయుర్ దేవాలయంలో పెళ్లి చేసుకుంది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ప్రీ వెడ్డింగ్, హల్దీ, మెహందీ, ఫొటో షూట్స్, సంగీత్ ఇలా అన్ని ఘనంగా జరుపుకున్న మీరా పెళ్లి మాత్రం గుడిలో చేసుకుంది.

ఇక ఈ అమ్మడు ఫొటోలను చూసిన వారంతా కంగ్రాట్స్ తెలుపుతున్నారు. కాగా, ఈ అమ్మడు మొదట యాంకర్‌గా పరిచయం అయిపనప్పటికీ.. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో జై బోలో తెలంగాణ మూవీతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో మలయాళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. గత ఏడాది మీరా నందన్ ఎన్నలుమ్ ఎంటే ఆలియా అనే మూవీలో చివరి సారిగా కనిపించింది. కానీ ఆ తర్వాత ఏ ప్రాజెక్ట్ ప్రకటించలేదు. అయితే పెళ్లి అయింది కాబట్టి మీరా సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతుందా? లేక నటిస్తుందా అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు



Next Story