భారీ గుడ్‌న్యూస్.. రష్మిక బర్త్‌ డే సందర్భంగా ఆ మూవీ టీజర్ విడుదల!

by Anjali |   ( Updated:2024-04-01 06:24:24.0  )
భారీ గుడ్‌న్యూస్.. రష్మిక బర్త్‌ డే సందర్భంగా ఆ మూవీ టీజర్ విడుదల!
X

దిశ, సినిమా: అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ రష్మిక మందన్న. క్యూట్‌నెస్, స్మైల్‌, నటనతో మెప్పిస్తూ.. నేషనల్ క్రష్‌గా ట్యాగ్ సంపాదించుకుంది. రీసెంట్ గా ‘యానిమల్’ సినిమాలో నటించి.. బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. వాటిలో రష్మిక ఫిమేల్ లీడ్ గా నటిస్తోన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఒకటి.

తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలయ్యే ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మన నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదల చేయనున్నారట మేకర్స్. ఈ విషయాన్ని స్వయంగా రష్మిక నే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

ఏప్రిల్ 5 వ తారీకున విడుదలయ్యే ఈ టీజర్ కోసం ఐదు లాంగ్వేజేస్ లో ఈ బ్యూటీనే డబ్బింగ్ చెప్పడం విశేషం. అయితే రష్మిక ఇప్పటివరకు కన్నడ, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పింది.. కానీ మలయాళంలో డబ్బింగ్ చెప్పడం ఇదే మొదటిసారి. ఈ వార్త విన్న రష్మిక ఫ్యాన్స్.. ‘దట్ ఇజ్ రష్మిక. డెడికేషన్ అంటే ఇలా ఉండాలి’ అంటూ కామెంట్లు పెడుతూ.. రీ ట్వీట్‌లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed