- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భార్యకు విడాకులివ్వబోతున్న ఫేమస్ స్టార్ కమెడియన్.. క్లారిటీ ఇదే!
దిశ, సినిమా : ప్రస్తుతం విడాకులు అనేవి చాలా కామన్ అయిపోయాయి. చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోతున్నారు. బుల్లితెర, వెండితెర, టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా డివోర్స్ తీసుకోవడం, సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం చాలా కామన్ అయిపోయింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో మరో స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వైవా హర్ష కూడా తన భార్య అక్షరకు విడాకులు ఇవ్వబోతున్నాడంటూ, సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.
ఆయన తన సోషల్ మీడియా అకౌంట్‌లో లైఫ్ అనేది రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ఎత్తుపల్లాలు,ఎగ్జైట్మెంట్, భయం థ్రిల్ ఇవన్నీ ఉంటాయి కానీ అవి ఏవీ మన చేతుల్లో ఉండవు, మనల్ని ఆపడానికి వస్తాయి, వెళ్లిపోతాయని చెప్పుకొచ్చాడు. అలాగే జీవితంలో ఏదీ ఆశించకూడదు, తర్వాత నిరాశ పడకూడదు, లైఫ్ ఎటు వెళ్తే మనం అటే వెళ్లాలి అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ తన భార్య కోసం చేశాడు, అతను తన జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా తన భార్యకు తనకు మనస్పర్థలు రావడంతో ఆయన తన వైవాహిక బంధానికి ముగింపు చెప్పబోతున్నాడంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
దీంతో తన ఫ్యాన్స్ ఇదంతా నిజమే, అని హర్ష గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. కానీ చివరికి ఆయన డివోర్స్ గురిచి మరో విషయం బయటకు వచ్చింది. తాజాగా ఆయన మరో కొత్త పోస్టు పెట్టాడు. ఆయన తన పోస్టులో. విడాకుల వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను నా పర్సనల్ లైఫ్‌లో చాలా సంతోషంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు.