- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Janvi Kapoor: ‘దేవర’ లో తన పాత్ర ఎలా ఉంటుందో ముందే చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ.. అస్సలు ఊహించి ఉండరుగా..!
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తల్లికి ఏమాత్రం తగ్గకుండా తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. మత్తెక్కించే కళ్లతో మెస్మరైజ్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా ఇప్పుడు తెలుగులోనూ తన సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ మూవీతో మన ముందుకు రాబోతుంది. అలాగే గ్లోబల్ స్టార్ సరసన కూడా ‘ఆర్సీ 16’ మూవీలో నటిస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ అందాలతో అదరహో అనిపిస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీకపూర్ దేవర మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. 'దేవర సినిమాలో నా పాత్ర సెకండాఫ్ లోనే ఎక్కువ ఉంటుంది. నేను జూనియర్ ఎన్టీఆర్‌తో ఒక సాంగ్ చేశాను. నెక్స్ట్ సాంగ్ షూట్ కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు జూనియర్ ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది' జాన్వీ కపూర్. అయితే జాన్వీ చేసిన కామెంట్స్‌ని బట్టి ఈ అమ్మడు పాత్ర నెగిటివ్ రోల్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే దేవర మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తైనట్లు టాక్. ప్రస్తుతం జాన్వీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.