- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలా చెప్పడానికి ఒక్కడుంటే చాలు ఏదైనా సాధించొచ్చు.. అందుకే కనెక్ట్ అయిపోయా: నిహారిక
దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఇటీవల తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకుని విడిపోయింది. ఆ తర్వాత ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌లో పలు వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అంతేకాకుండా నిర్మాతగా మారి వెబ్‌సిరీస్‌లు, సినిమాలు తెరకెక్కిస్తూనే హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం నిహారిక పూర్తిగా ఇండస్ట్రీలో రాణించే ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, నిహారిక ‘సాగు’ ప్రెస్‌మీట్‌లో పాల్గొని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘ సాగు నా మనసుకు బాగా దగ్గరైన సినిమా. ఎందుకంటే నేను కూడా మీలాగే ఒక స్క్రీనింగ్‌కు అతిథిగా పిలిస్తే వెళ్లాను అందులో నాకు కనెక్ట్ అయిన విషయం ఒకటుంది. అదేంటంటే.. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం సాధారణ విషయం. ఎన్ని దెబ్బలు తగిలినా ఏ మాత్రం చింతించకుండా ధైర్యంతో ముందడుగు వేయడానికి ఫ్యామిలీ, స్నేహితులు తోడుగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. నేను అంతలా కనెక్ట్ కావడానికి ఇంకో ముఖ్యమైనది కూడా ఉంది. మన దగ్గర రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటాయి. సాగులో ఆ విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు.
ఈ క్రమంలోనే ఏమైనా పర్లేదు చూసుకుంటాం అని చెప్పేవాడు ఒక్కడుంటే చాలు జీవితంలో కష్టం వచ్చినప్పుడు చనిపోకుండా ఏదైనా సాధించడానికి ముందడుగు వేయగలం. నేను బాధలో ఉన్నప్పుడు నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నాకు అండగా నిలబడి ముందుకు వెళ్లడానికి సహాయం చేశారు. ఆ విషయంలో నేను వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిహారిక కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా సాగు సినిమా మార్చి 4న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. వినయ్ రత్నం తెరకెక్కించిన ఈ మూవీకి రిలీజ్ కాకముందే ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకుని రికార్డ్ సృష్టించింది.