‘అఖండ-2’ నుంచి ఆ బ్యూటీ అవుట్.. నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్

by Kavitha |
‘అఖండ-2’ నుంచి ఆ బ్యూటీ అవుట్.. నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్
X

దిశ, సినిమా: పద్మ భూషణుడు, నందమూరి బాలకృష్ణ(Balakrishna) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. అందులో ‘అఖండ-2’(Akhanda-2) ఒకటి. 2021లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ , బ్లాక్ బస్టర్ మూవీ అయినటువంటి ‘అఖండ’(Akhanda) సినిమాకు సీక్వెల్‌గా ‘అఖండ-2’ తెరకెక్కుతుండగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్(Samyuktha Menon), ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాని బాలయ్య రెండో కూతురు తేజస్విని(Tejaswini) సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట(Ram Achanta), గోపీ ఆచంట(Gopi Achanta)లు తెరకెక్కిస్తున్నారు.

కాగా ఇక ఈ సినిమాకు తమన్(Thaman) సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ‘అఖండ- 2’ దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట షికారు చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం నుంచి ప్రగ్యా జైస్వాల్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె తప్పుకోవడం వల్లనే ఆమె ప్లేస్‌లోకి యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ మధ్యే బాలయ్యతో కలిసి సంయుక్త ఓ గోల్డ్ యాడ్, అండ్ షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ భామను ‘అఖండ 2’లో హీరోయిన్‌గా తీసుకున్నట్లు సమాచారం.

అయితే సంయుక్త రావడం వరకు ఓకే కానీ బాలయ్యతో ఇప్పటికే ‘అఖండ’(Akhanda)తో పాటు మొన్నొచ్చిన ‘డాకు మహారాజ్‌’(Daku Maharaj)లోనూ నటించిన ప్రగ్యా ఈ సినిమా నుంచి సడెన్‌గా తప్పుకోవడంతో అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. అయితే ఇంత రిలేషన్ ఉన్నా ప్రగ్యా ఎందుకు ఈ సినిమా నుంచి తప్పుకుంది అనేది అర్థం కాని విషయం. అసలు ఆమె తప్పుకుందా లేదంటే తప్పించారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అలాగే నిజంగా ఈ మూవీలో సింగిల్ హీరోయిన్ ఉంటుందా లేదంటే ఇద్దరు ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed