'పాథోన్‌ పథం నూట్టండు' సినిమాతో.. 'కాంతారా' అవుట్ అవుతుందా?

by Hamsa |
పాథోన్‌ పథం నూట్టండు సినిమాతో.. కాంతారా అవుట్ అవుతుందా?
X

దిశ, సినిమా: సిజు విల్సన్‌ ప్రధాన పాత్రలో కాయాదు లోహర్‌ కథానాయికగా తెరకెక్కిన మలయాళం యాక్షన్‌ పీరియడ్‌ డ్రామా 'పాథోన్‌ పథం నూట్టండు'. వినయన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ మలయాళంలో విడుదలై బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేసేందుకు, హక్కుల కోసం ఎంతో మంది పోటీపడగా 'యమ్మదొంగ' లాంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను నిర్మించిన ప్రముఖ సీనియర్‌ నిర్మాత సిహెచ్‌. సుధాకర్‌ బాబుకి దక్కింది. ఆల్‌ ఇండియా ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని 'పులి' అనే టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. హీరో సిజు విల్సన్‌, హీరోయిన్‌ కాయాదు లోహర్‌, దర్శకుడు వినయన్‌, నిర్మాత సుధాకర్‌ బాబు, ప్రసాద్‌ నాయక్‌, కెఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌ తదితరులు టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పాల్గన్నారు. టీజర్ గురించి మట్లాడుకుంటే.. కుల గొడవలు కలిగి బోల్డ్‌గా ఉన్న చిత్రం 'కాంతారావు' మూవీని గుర్తు చేస్తుంది. ఈ సినిమా ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి మరి.

Next Story

Most Viewed