రష్మికకు మద్దతుగా తెలుగు జర్నలిస్టులు..

by Anjali |   ( Updated:2023-11-09 07:13:28.0  )
రష్మికకు మద్దతుగా తెలుగు జర్నలిస్టులు..
X

దిశ, సినిమా: తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు ఒక సమస్య ఎదురైన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో తన డీప్ ఫేక్ వీడియో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.దీంతో రష్మిక షాక్ చాలా బాధ పడుతూ రియాక్ట్ అయింది. దీంతో తనకు మద్దతుగా సినీ ప్రముఖులంతా తరలి వచ్చారు. అలాగే రాజకీయ నాయకులు కవిత, KTR వంటి వారు కూడా రష్మికకు సపోర్ట్ గా నిలిచారు. తమ అభిమాన నటికి ఊహించని కష్టం ఎదురవడంతో ఆ వీడియోను ఖండిస్తూ అభిమానుల నుంచి కూడా సపోర్ట్ లభించింది. ఇక తాజాగా ఆమెకు మద్దతుగా తెలుగు సినిమా జర్నలిస్ట్ అసోసియేషన్ ఈ విషయం పై స్పందిస్తూ కేసు ఫైల్ చేసి ఆమెకు ధైర్యం చెప్పారు. దీంతో రష్మిక వారి మద్దతుకు ప్రత్యేకం ధన్యవాదములు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Advertisement

Next Story