- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
కాల్ గర్ల్‌గా మారిన తెలుగు హీరోయిన్.. ఇదే బాగుందంటూ కామెంట్స్!

దిశ, సినిమా : శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెనాలి అమ్మాయి, తెలుగు హీరోయిన్‌గా గుఢాచారి సినిమాతో వెండితెరకు పరిచయమైంది. అందం, అభినయంతో పాటు తన నటనతో ఈ ముద్దుగుమ్మ ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ తనదైన శైలిలో ఈ చిన్నది తన కెరీర్‌ను బిజీగా మార్చుకుంటుంది. ఇక ఈ బ్యూటీ 2013లో జరిగిన మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని రన్నరప్ అయిన విషయం తెలిసిందే. శోభితాకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ నెట్టింట ఎప్పుడూ తెగ వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ నటికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ ట్రెండ్ అవుతోంది. అది ఏమిటంటే?
రీసెంట్‌గా శోభిత మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలో వేశ్యగా నటించింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి, కాల్ గర్ల్‌గా నటించడంపై తన ఫీలింగ్స్ బయటపెట్టంది. మంకీ మ్యాన్ ఏప్రిల్ 5న యూఎస్‌ఏలో విడుదల చేశారు. అక్కడ మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో నేను సీత అనే వేశ్య పాత్రలో నటించాను. ఈ పాత్ర చేయడం నాకు చాలా గర్వంగా అనిపించింది. మూవీలో నా పాత్రకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఏప్రిల్ 26న ఇండియాలో కూడా విడుదల చేయడానికి మూవీ టీం సన్నాహాలు చేస్తున్నారు. నా పాత్ర మీకు కూడా నచ్చుతుందని నాకు నమ్మకం ఉందంటూ వేశ్యపాత్రపై ఓపెన్‌గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Read More..
మాజీ సీఎం మనవడితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్.. త్వరలో పెళ్లి?