సూపర్‌ స్టార్ ఫోన్ కాల్‌ ద్యారా ప్రశంసలందుకున్న తెలుగు దర్శకుడు

by Prasanna |   ( Updated:2023-02-04 12:10:10.0  )
సూపర్‌ స్టార్ ఫోన్ కాల్‌ ద్యారా ప్రశంసలందుకున్న తెలుగు దర్శకుడు
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ హీరోగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వీర సింహా రెడ్డి'. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2023 న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. అయితే రీసెంట్‌గా ఈ సినిమాను చూసిన సూపర్ స్టార్ రజనీ కాంత్ గోపీచంద్ మలినేని‌కి ఫోన్ చేసి తెగ మెచ్చుకోవడమేగాక ఆయపై ప్రశంసలు కురిపించాడు. ఈ విషయాన్ని దర్శకుడు తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. ''నాకు తలైవర్, సూపర్ స్టార్ నుంచి కాల్ వచ్చింది. అతను 'వీర సింహా రెడ్డి' మూవీ‌ని చూశాడు. సినిమా‌ను ఇష్టపడ్డాడు. నా సినిమా గురించి అతని ప్రశంసలు, అతను అనుభవించిన భావోద్వేగం నాకు ఈ ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ. థాంక్యూ రజనీ సార్'' అంటూ ట్వీట్ చేశాడు.

Advertisement

Next Story