లవ్ బ్రేకప్ గురించి చెబుతూ.. పెళ్లి‌పై క్లారిటీ ఇచ్చేసిన టాలీవుడ్ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్!

by Hamsa |   ( Updated:2024-05-19 14:03:45.0  )
లవ్ బ్రేకప్ గురించి చెబుతూ.. పెళ్లి‌పై  క్లారిటీ ఇచ్చేసిన టాలీవుడ్ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘అంతకు ముందు ఆ తర్వాత’ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత ఎన్ని చిత్రాల్లో ఈషా రెబ్బా సెకండ్ హీరోయిన్‌గా నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ భామ బ్రాండ్ బాబు, ఎన్నీఆర్ అరవింద సమేత, బ్యాచ్‌లర్ వంటి చిత్రాలతో ఫేమ్ దక్కించుకుంది. ఇటీవల ఈషా రెబ్బా మాయా బజార్‌ ఫర్‌ సేల్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఓటీటీపై దృష్టి పెట్టి వెబ్ సిరీస్ చేస్తుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈష బ్రేకప్, పెళ్లిపై స్పందించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘‘ ఉద్యోగం చేస్తే ప్రతిరోజు ఒకేలాంటి మనుషులను కలుస్తాం. వారు ఫ్రెండ్స్ అవుతారు రిలేషన్‌షిప్ చాలా ఏళ్లు కొనసాగించవచ్చు. కానీ ఇండస్ట్రీలో అలా ఉండదు. రోజుకో మనిషిని కలవాల్సి వస్తుంది. ఈ క్రమంలో రకరకాల చర్చలు కూడా జరుగుతాయి. అప్పుడే ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. ఇండస్ట్రీ ఏంటి అనే అవగాహన వస్తుంది. నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. కానీ అవి రాంగ్ రిలేషన్స్. నేను ఎవరినైనా తొందరగా నమ్మేస్తాను. కొద్ది రోజుల తర్వాత వాళ్లు ఎలాంటి వారు అనేది అర్థం అవుతుంది. కానీ అలాంటి రిలేషన్‌షిప్ నుంచి అంత ఈజీగా తప్పించుకోలేము. నా విషయంలో అదే జరిగింది. నేను రాంగ్ రిలేషన్స్‌లో ఉన్నా. అందుకే వదిలేసాను.

విడిపోవడానికి కారణం చిన్న చిన్న సమస్యలే అయినప్పటికీ రిలేషన్‌లో ఉన్నప్పుడు అవి పెద్దగా కనిపిస్తాయి బాధిస్తాయి. నా బ్రేకప్‌లు కాస్త హార్ష్‌గానే జరిగాయి. వారి గురించి తెలుసుకుని నెమ్మదిగా వదిలేశాను’’ అని చెప్పింది. ఆ తర్వాత పెళ్లి పై మీ ఉద్దేశం ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా.. ఈషా రెబ్బా స్పందిస్తూ.. పెళ్లి అంటే నాకు చాలా భయం. అసలు ఆ పదం వింటేనే వణుకుపుడుతుంది. ఎందుకంటే.. పెళ్లి అనేది నా దృష్టిలో చాలా పెద్ద విషయం. దాని ఫేస్ చేయలేను. కాబట్టి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో ఈ విషయాలు తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అవుతూ ఈషా రెబ్బాకు పెళ్లి అంటే అంత భయమా? అని చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed