మాజీ ఎమ్మెల్యే గుమ్మడి న‌ర్సయ్య బ‌యోపిక్‌లో స‌ముద్రఖ‌ని

by Hamsa |   ( Updated:2023-12-11 07:24:14.0  )
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి న‌ర్సయ్య బ‌యోపిక్‌లో స‌ముద్రఖ‌ని
X

దిశ, సినిమా: డైరెక్టర్‌గా కెరీర్‌ను మొద‌లుపెట్టిన సముద్రఖని..తర్వాత విల‌న్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా హీరోగా కూడా న‌టిస్తూ వెర్సటైల్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రజంట్ తెలుగు, త‌మిళ భాష‌ల్లో భారీ బ‌డ్జెట్ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక తాజాగా తెలంగాణ మాజీ ఎమ్మెల్యే బ‌యోపిక్ కి సముద్రఖని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

సీపీఐ ఎంఎల్ పార్టీ త‌ర‌ఫున ఖమ్మంలోని ఇల్లెందు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు గుమ్మడి న‌ర్సయ్య . ఇక ఎమ్మెల్యేగా గెలిచి కూడా బ‌స్, ట్రైన్‌తోపాటు సైకిల్‌పైనే ప్రయాణం చేస్తూ సాధార‌ణ జీవితం గ‌డిపాడు. ఎలాంటి ఆస్తుల‌ను కూడ‌బెట్టుకోకుండా, కనీసం తన సొంత ఇళ్లు కూడా క‌ట్టుకోలేకోకుండా.. పేద ప్రజ‌ల ఆశాజ్యోతిగా నిలిచాడు గుమ్మడి న‌ర్సయ్య. ఇక ఇంతగొప్ప నాయకుని జీవితాన్ని వెండితెర‌పైకి తీసుకొచ్చే ప్రయ‌త్నాలు చాలా కాలంగా జ‌రుగుతోన్నాయి. అత‌డి బ‌యోపిక్‌లోనే స‌ముద్రఖ‌ని న‌టించ‌నున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ద‌ర్శకుడు ఎవ‌ర‌న్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed