- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెమ్యునరేషన్ పెంచేసిన తేజా సజ్జ.. ఒక్కో సినిమాకు ఎంత అంటే?
దిశ, సినిమా : బాలనటుడిగా ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు తేజ సజ్జ. ప్రస్తుతం ఈ యంగ్ హీరో హనుమాన్ మూవీ సక్సెస్ జోష్‌లో ఉన్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ పాన్ ఇండియా లెవల్‌లో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించి మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో తేజ నటనకు స్టార్ హీరోలు సైతం ఫిదా అయ్యారు. తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు ఈ కుర్ర హీరో.
అయితే తేజకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.హనుమాన్ మూవీ దాదాపు 300కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు గాను తేజ కోటి రూపాయలలోపు పారితోషకం తీసుకున్నాడు. అయితే సినిమా మంచి హిట్ అందుకోవడంతో ఆయన పారితోషకం పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఒక్కో సినిమాకు రూ.5 నుంచి 10 కోట్ల రూపాయల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట తేజ. అయితే ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పుడు తేజ పాన్ ఇండియా స్టార్.. అందుకే తను చేయబోయే కొత్త సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రెడీ అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత రెమ్యూనరేషన్ అడగడంలో తప్పేమీ లేదని కొందరు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడట.