Devara Movie: హాలీవుడ్ స్టేజిపై ‘దేవర’ సినిమా గురించి ఫిలిం ఫెస్ట్‌లో చెప్తున్న తారక్..

by Prasanna |   ( Updated:2024-09-25 14:40:30.0  )
Devara Movie: హాలీవుడ్ స్టేజిపై ‘దేవర’ సినిమా గురించి ఫిలిం ఫెస్ట్‌లో చెప్తున్న తారక్..
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ఎక్కడా చూసిన దేవర సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు. అమెరికా లాస్ ఏంజిల్స్ లో ఫిలిం ఫెస్టివల్ బియాండ్ ఫెస్ట్ లో దేవర ఫస్ట్ షో పడనుంది. ఈ నేపథ్యంలోనే బియాండ్ ఫెస్ట్ లో దేవర మూవీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి ఎన్టీఆర్ అమెరికా వెళ్ళారు.

తాజాగా, బియాండ్ ఫెస్ట్ అకౌంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతున్న ఫొటోను పోస్ట్ చేసి.. ఇక్కడికి వచ్చి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చారు.. తను హీరోగా నటించిన దేవర మూవీ గురించి రెండు మాటల్లో మాట్లాడారు. దీంతో ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ స్టేజిపైకి ఎక్కగానే ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ కొంతసేపు హడావుడి చేసారు.

ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా తర్వాత హాలీవుడ్ ఫిలిం ఫెస్ట్ లో దేవర గురించి మాట్లాడుతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Advertisement

Next Story