Sushmita Sen: రిలేషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ విశ్వసుందరి.. క్లారిటీ!

by Anjali |
Sushmita Sen: రిలేషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ విశ్వసుందరి.. క్లారిటీ!
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గురించి స్పెషల్‌గా చెప్పుకోనసవరం లేదు.బాలీవుడ్ హీరోయిన్.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గురించి స్పెషల్‌గా చెప్పుకోనసవరం లేదు. మిస్ యూనివర్స్ టైటిల్ గెలుపొందిన ఫస్ట్ భారతీయురాలిగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ హీరోయిన్ చిత్రాలతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొని గొప్ప మనసు చాటుకుంది. ఇకపోతే సుస్మితా సేన్ చాలా మందితో డేటింగ్ చేసినట్లు తరచూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటూనే ఉంటాయి. కానీ ఈమె ఎవరిని జీవిత భాగస్వామిగా యాక్సెప్ట్ చేయలేదు. అప్పట్లో ఐపీఎస్ మాజీ చెర్మైన్ లలిత్ మోదీతో ప్రేమలో పడింది. కానీ వీరి లవ్ ఎక్కువ కాలం నిలవలేకపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మాజీ బాయ్ ఫ్రెండ్ రోహ్మన్ ఈమె జీవితంలో ఒక భాగస్వామిగా కొనసాగుతున్నాడు.

కానీ వీరి మధ్య లవ్ లేదని, కేవలం స్నేహపూర్వక బంధాన్ని పంచుకుంటున్నానని తెలిపారు. వీరిద్దరు తరచూ.. పార్టీలు, ఈవెంట్లకు కలిసే వెళ్తున్నారు. రోహ్మన్ ఈ బ్యూటీకి నీడగా తోడుంటున్నాడు. ఇకపోతే తాజాగా సుస్మితా సేన్ ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు విషయాలు పంచుకుంది. ప్రెజెంట్ తన లైఫ్ లో ఏ మగాడు లేడని చెప్పుకొచ్చింది. మూడు సంవత్సరాలుగా సింగిల్‌గానే ఉంటున్నానని తెలిపింది. ఇప్పుడు ఎవరిని ప్రేమించాలన్న థాట్, ఆ ఇంట్రెస్ట్ కూడా లేదని వెల్లడించింది. 5 ఏళ్లు ఒకరితో ప్రేమలో ఉన్నానని.. ఇప్పుడు లవ్ లైఫ్ లో విరామం తీసుకోవడం చాలా బాగుందని సుస్మితా సేన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed