షూటింగ్‌లో గాయపడ్డ స్టార్ డైరెక్టర్.. ఆందోళనలో అక్షయ్ ఫ్యాన్స్

by sudharani |   ( Updated:2023-02-05 13:08:40.0  )
షూటింగ్‌లో గాయపడ్డ స్టార్ డైరెక్టర్.. ఆందోళనలో అక్షయ్ ఫ్యాన్స్
X

దిశ, సినిమా: సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన 'సూరరై పొట్రు' బిగ్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీని అక్షయ్ కుమార్‌‌తో హిందీలో తెరకెక్కిస్తున్న సుధ కొంగర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా షూటింగ్‌లో ఆమె గాయపడినట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. తన విరిగిన చేతిని చూపిస్తూ రెండు ఫొటోలను షేర్ చేసింది. 'ఇది చాలా పెయిన్‌గా ఉంది. చిరాకుగా ఉంది' అని తెలిపింది. ఒక నెల రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపినట్లు పేర్కొంది.

READ MORE

వాళ్లకోసమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను: రాఘవేంద్రరావు!

Advertisement

Next Story

Most Viewed