ప్రేమ వ్యవహారం బయటపెట్టిన సుప్రిత!.. నా జీవితంలోకి వాళ్లు వస్తుంటారు పోతుంటారంటూ పోస్ట్

by Disha Web Desk 6 |
ప్రేమ వ్యవహారం బయటపెట్టిన సుప్రిత!.. నా జీవితంలోకి వాళ్లు వస్తుంటారు పోతుంటారంటూ పోస్ట్
X

దిశ, సినిమా: నటి సురేఖ వాణి కూతురు సుప్రిత సోషల్ మీడియాలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఈ అమ్మడు సినిమాల్లో నటించినప్పటికీ తల్లితో కలిసి చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఇద్దరు పలు వెకేషన్స్‌కు వెళ్తూ డాన్స్ చేసే వీడియోలను నెట్టింట పెట్టి నానా హంగామా చేస్తుంటారు. అయితే సుప్రిత సోషల్ మీడియాలో పలు హాట్ ఫొటోస్ షేర్ చేసి తల్లిని మించిన పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాకుండా హీరోయిన్‌గా ఓ సినిమా కూడా చేస్తుంది. ఇందులో బిగ్ బాస్ అమర్ దీప్ హీరోగా నటిస్తున్నాడు.

ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో.. తాజాగా, సుప్రిత పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. కొన్ని గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తూ.. నా జీవితంలోకి కొందరు వస్తుంటారు వెళుతుంటారు. అదే లైఫ్ అంటే’’ అని రాసుకొచ్చింది. అలాగే కామెంట్స్ కూడా హైడ్ చేసింది. ఇక అది చూసిన నెటిజన్లు ఎవరితోనైనా ప్రేమలో పడిందేమో అందుకే ఆ విషయాన్నే ఈ పోస్ట్‌తో బయటపెట్టిందని చర్చించుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ సుప్రిత ఫొటోలు మాత్రం కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

Next Story