- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Article 370 OTT: ‘ఆర్టికల్ 370’ ఓటీటీలోకి వచ్చేది ఆరోజే..!
దిశ, సినిమా: ఇటీవల కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా రకరకలా సినిమాలు, డాక్యూమెంటరీలు తీస్తున్నారు. అలా వచ్చిన తాజా చిత్రం ‘ఆర్టికల్ 370’. దర్శకుడు ఆదిత్య సుహాస్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని ప్రభుత్వం ఎత్తివేసిన అంశంపై తెరకెక్కింది. ఫిబ్రవరి 23న విడుదలై ఈ సినిమాలో ఏజెంట్‍గా యామి గౌతమ్, పీఎంవో జాయింట్ సెక్రటరీగా ప్రియమణి యాక్టింగ్ హైలైట్ అవ్వగా. రాజ్ అరుణ్, శివమ్ ఖజురియా, వైభవ్ తత్వవాది, అరుణ్ గోవిల్, రాజ్ జుత్షి, దివ్య సేథ్, కిరణ్ కర్మాకర్ ఈ చిత్రంలో కీరోల్స్ చేశారు. ప్రతి ఒకరి యాక్టింగ్ సూపర్బ్ అని చెప్పవచ్చు.
దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆరంభంలో పెద్దగా వసూళ్లు రాలేదు. కానీ ఆ తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు పెరిగాయి. లాంగ్ రన్‍లో ఈ చిత్రం ఇంకా వసూళ్లను రాబడుతోంది. అలా ఇప్పటివరకు ఈ సినిమాకి సుమారు రూ.105 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దీంతో కమర్షియల్‍గా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.
ఇక తాజాగా ఈ మూవీ OTT స్ట్రీమింగ్ పై అప్ డేట్ వచ్చింది. కాగా ఈ ‘ఆర్టికల్ 370’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ‘జియోసినిమా’ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. ఇక ఈ ఏప్రిల్ 19 నుండి జియోసినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.