వరుస చిత్రాలతో బిజీ అయిపోయిన keerthy Suresh

by Prasanna |   ( Updated:2023-06-03 07:10:43.0  )
వరుస చిత్రాలతో బిజీ అయిపోయిన keerthy Suresh
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌ గత ఐదేళ్లుగా కష్టాల్లో ఉంది. లాస్ట్ ఇయర్ మహేష్ మూవీ ‘సర్కారు వారి పాట’తో వచ్చినప్పటికీ అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ సినిమా కంటే ముందు కూడా రెండు మూడు చిత్రాలు ఫ్లాప్ అవడంతో కీర్తి ఇక తన కెరీర్ ముగిసిపోయింది అనుకుందట. కానీ ఇటీవల ‘దసరా’ మూవీతో తిరిగి లైన్‌లోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. నానికి జోడీగా తన నటనతో ఆకట్టుకుంది. దీంతో ఒక్కసారిగా పాపులారిటీ పెరిగిపోయిన ఆమె చేతిలో ప్రస్తుతం ఒకటో.. రెండో కాదు. ఏకంగా అరడజను సినిమాలు ఉన్నాయి. ఒక్కసారి ఆ లిస్ట్ గనుక చూసుకుంటే.. మెగాస్టార్‌కి చెల్లిగా ‘భోళా శంకర్’ సినిమాలో కనిపించనుంది. దీంతోపాటు ఆమె తమిళ చిత్రం‘మామన్నన్‌’లోనూ నటిస్తోంది. అలాగే సైరన్, రివాల్వర్ రీటా, రఘు తాత వంటి చిత్రాల్లోనూ నటిస్తోంది. కాగా ఈ మొత్తం మూవీస్‌లో రెండు లేదా మూడు హిట్‌లు అందుకున్నా కీర్తి నెంబర్‌వన్ ప్లేస్‌ను పొందే అవకాశం ఉంది.

Also Read..

Keerthy Suresh: బాయ్ ఫ్రెండ్ నాకు తెలుసు.. వారి వల్ల మనఃశాంతి కరువైంది.. ఆమె తండ్రి షాకింగ్ కామెంట్స్

ఆ మూవీ‌ కోసం రాజమౌళి ఎంత పెద్ద రిస్క్ చేశాడో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed