ఎట్టకేలకు పెళ్లి చేసుకోబుతున్న సుడిగాలి సుధీర్.. డేట్ కూడా ఫిక్స్.. మొత్తానికి రష్మి స్టోరీ క్లోజ్..

by Dishafeatures3 |
ఎట్టకేలకు పెళ్లి చేసుకోబుతున్న సుడిగాలి సుధీర్.. డేట్ కూడా ఫిక్స్.. మొత్తానికి రష్మి స్టోరీ క్లోజ్..
X

దిశ, సినిమా: మెజిషియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుడిగాలి సుధీర్.. జబర్దస్త్ షోతో ఫుల్ పాపులారిటీ సంపాదించాడు. భారీ పారితోషికం తీసుకుంటూ కోట్ల మంది ఫ్యాన్స్ ను కూడా పొందాడు. అయితే సుధీర్ - రష్మి జంటకు ప్రత్యేక క్రేజ్ ఉండగా.. రీల్ పరంగానే కాదు రియల్ లైఫ్ లోనూ ఒక్కటి అవుతారని అనుకున్నారు అభిమానులు. కానీ వీళ్లు ఇద్దరు కలవరని కన్ఫర్మ్ అయిపోయింది. కాగా తాజాగా సుధీర్ పెళ్లి ముచ్చట మళ్లీ తెరపైకి వచ్చింది. రష్మిని కాకుండా మరో అమ్మాయిని కట్టుకోబుతున్నాడని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్న బంధువుల అమ్మాయితో సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్ అయిందని తెలుస్తుంది. ఇరు కుటుంబాలు ఈ విషయంపై మాట్లాడుకుని.. అమ్మాయి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక వివాహం జరిపిద్దామని అనుకున్నట్లు సమాచారం. అంటే వచ్చే ఏడాదికి చదువు పూర్తి చేస్తే వెంటనే సమ్మర్ లో పెళ్లి జరిపించాలని ప్లాన్ అని టాక్. ఇదే జరిగితే రష్మి - సుధీర్ పెయిర్ ను ఇష్టపడే ఫ్యాన్స్ కచ్చితంగా బాధపడతారు. అందుకే అలా జరగొద్దని.. వీరిద్దరే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు.



Next Story

Most Viewed