మెగాస్టార్ ఫామ్ హౌస్‌లో స్టార్ సింగర్స్ రచ్చ.. క్యూటీ లిప్సిక చిలిపి చేష్టలు వైరల్

by Anjali |
మెగాస్టార్ ఫామ్ హౌస్‌లో స్టార్ సింగర్స్ రచ్చ.. క్యూటీ లిప్సిక చిలిపి చేష్టలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవికి బెంగళూరులో ఫామ్ హౌస్ ఉన్న విషయం తెలిసిందే. కాగా టాలీవుడ్ సింగర్లంతా హైదరాబాదు నుంచి బెంగళూరుకు చెక్కెశారు. ఇక చిరు ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ ఎలాగైన హిట్ కొట్టాలని మెగాస్టార్ పట్టుదలతో ఉన్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కాగా ముందుగా ఈ మూవీ పాటలతో ప్రారంభించారు. మునపటి సినిమాలకు ముందు కూడా సాంగ్స్‌తోనే స్టార్ట్ చేసేవాళ్లట.

కాగా ఆనవాయితీగా వస్తోన్న ఈ పద్ధతిని విశ్వంభర మూవీకి కూడా పాటిస్తున్నారు. దీంతో సింగర్లంతా చిరు ఓన్ ఫామ్ ఫామ్ హౌస్‌లో సందడి షురు చేశారు. డైరెక్టర్ వశిష్ట, నిర్మాత, సంగీత దర్శకుడు కీరవాణి అండ్ ఈయనతో పాడే సింగర్స్ అంతా చిరు ఇంట్లోనే విశ్వంభర మ్యూజిక్ సెట్టింగ్స్ పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. చిరంజీవి కూడా సింగర్స్‌లో కలిసి సందడి చేస్తుండటం చూసి మెగా అభిమానులు తెగ ముచ్చటపడిపోతున్నారు. సింగర్ లిప్సిక చిలిపి చేష్టలకు క్యూట్ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed