VIJAY DEVARAKONDA:విజయ్ దేవరకొండ చిత్రంలో స్టార్ సీరియల్ నటి.. ఎవరో తెలిస్తే షాక్!

by Anjali |
VIJAY DEVARAKONDA:విజయ్ దేవరకొండ చిత్రంలో స్టార్ సీరియల్ నటి.. ఎవరో తెలిస్తే షాక్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మొదట్లో హీరో ఫ్రెండ్ పాత్రల్లో నటించి.. తర్వాత తన టాలెంట్‌తో హీరోగా అవకాశాలు దక్కించుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. రొమాంటిక్ సీన్స్, విజయ్ యాటిట్యూడ్‌‌కు యూత్ ఫుల్ ఫిదా అయిపోయారు. రీసెంట్‌గా తెరకెక్కిన ‘కల్కి2898’ మూవీలో చివర్లో కనిపించి ఫ్యాన్స్‌కు ఎనర్జీ ఇచ్చాడు. అలాగే పరుశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా చేశాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననురి కలయిలో ఓ సినిమా తెరకెక్కుతోంది.

ఈ చిత్ర టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. VD 12 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుగుతోన్న ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్స్ కథానాయికగా నటిస్తోంది. ఈమె ప్రజెంట్ రవితేజ సరసన ‘మిస్టర్ బచ్చన్’ అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఇదిలా ఉండలా.. సిని వర్గాల సమాచారం ప్రకారం ఓ స్టార్ సీరియల్ నటిని విజయ్ మూవీలో కీలక పాత్రలో తీసుకుంటున్నారట. ఆమెవరో కాదు.. నవ్య స్వామి. ఇప్పటికే కావ్య ‘ఇంటింటి రామాయణం’ చిత్రంలో కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. ఇందులో అద్భుతమైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోగా.. కావ్య నటించబోతున్న VD12 మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి.



Next Story

Most Viewed