కూతురి ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్.. ఎంత క్యూట్‌గా ఉందో? (పోస్ట్)

by Hamsa |
కూతురి ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్.. ఎంత క్యూట్‌గా ఉందో? (పోస్ట్)
X

దిశ, సినిమా: కన్నడ బ్యూటీ మిలానా నాగరాజ్ అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు అగ్రహీరోలతో కలిసి సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత ఏడాది ‘కౌశల్య సుప్రజ రామ’ మూవీతో ప్రేక్షకులను అలరించింది. కెరీర్ మంచి పీక్స్‌లో ఉండగా మిలానా 2021లో నటుడు కృష్ణను పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది మార్చిలో ప్రెగ్నెన్సీ విషయాన్ని వెల్లడించింది. రీసెంట్‌గా మిలానాకు పాప పుట్టింది. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన వీడియోను షేర్ చేస్తూ ‘‘మా చిన్న ప్రపంచంలోకి నా కూతురు ‘పరి’ వచ్చింది’’ అనే క్యాప్షన్ జత చేసింది.

ప్రజెంట్ మిలానా, కృష్ణల కూతురు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన వారంతా క్యూట్‌గా ఉందని కామెంట్లు పెడుతున్నారు. కాగా, మిలానా సినిమాల విషయానికొస్తే.. ప్రజెంట్ పలు మూవీస్‌లో హీరోయిన్‌గా నటిస్తూనే భర్తతో కలిసి నిర్మాతగానూ చిత్రాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed