ANANTH AMBANI:అనంత్ అంబానీ-రాధిక పెళ్లికి కళ్లుచెదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చిన స్టార్ హీరోలు.. కోట్లలో విలువ

by Anjali |   ( Updated:2024-07-23 13:45:48.0  )
ANANTH AMBANI:అనంత్ అంబానీ-రాధిక పెళ్లికి కళ్లుచెదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చిన స్టార్ హీరోలు.. కోట్లలో విలువ
X

దిశ, సినిమా: ఇటీవల ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. చరిత్రలో నిలిచిపోయేలా అనంత్ అంబానీ వివాహం కోట్లలో ఖర్చు పెట్టి జరిపించారు. వీరి వివాహానికి ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు హాజరై.. అట్రాక్షన్‌గా నిలిచారు. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లై వారం దాటుతోన్న సోషల్ మీడియాలో వీరి ఫొటోలు ఇంకా ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. అయితే అనంత్ అంబాన-రాధికకు ఎవరెవరు ఏం గిఫ్ట్స్, ఎంత కాస్ట్ పెట్టి తీసుకొచ్చారంటూ ప్రస్తుతం నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. కొత్త దంపతులకు ఏ హీరో ఏం బహుమతి ఇచ్చారో ఇప్పుడు చూద్దాం..

అమితాబ్ బచ్చన్- నెక్‌పిస్ ( రూ. 30 కోట్లు), ప్రముఖ బిజినెస్‌మ్యాన్ బిల్ గేట్స్- వజ్రం ( రూ. 9 కోట్లు). రణవీర్ సింగ్-దీపికా పదుకొణె- రోల్స్ రాయిస్ కారు (20 కోట్లు),రస్ట్లర్ జాన్ సెనా -లాంబోర్గినీ కారు(రూ. 3కోట్లు), అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ - బుగాటీ కారు ( 11. 50 కోట్లు ), సల్మాన్ ఖాన్ -స్పోర్ట్స్ బైక్( 15 కోట్ల రూపాయలు), రణబీర్ కపూర్-అలియా భట్: మెర్సిడెస్ బెంజ్ కారు (రూ. 9 కోట్లు), అక్షయ్ కుమార్ -బంగారు పెన్ను(60 లక్షల రూపాయలు), విక్కీ కౌశల్-కత్రినా కైఫ్- గోల్డ్ చెయిన్ (19 లక్షలు), సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ.. హ్యాండ్ మేడ్ శాలువ, చిన్న గోల్డ్ చెయిన్, వాట్, బ్లేజర్లు, కార్లు, రింగ్స్, బ్రేస్లెట్లు ఇచ్చారట. దాదాపు నాలుగు కేజీల గోల్డ్ వస్తువులు గిఫ్ట్స్ గా ఇచ్చారట.అలాగే తల్లిదండ్రులు నీతా అంబానీ-ముఖేష్ అంబానీ కూడా పామ్ జుమేరాలో 3 వేల చదరపు అడుగుల ఓ ఇల్లును గిఫ్ట్స్ గా ఇచ్చారట. దీని ధర 60 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. రాధికకు 130 కోట్ల రూపాయల విలువ గల నగలు ఇచ్చారట. 5. 42 కోట్ల బెంట్లీ కారు కూడా బహుమతిగా ఇచ్చారట.

Advertisement

Next Story