మషేష్ బాబును అవమానించిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా?

by Anjali |   ( Updated:2023-08-08 15:45:32.0  )
మషేష్ బాబును అవమానించిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు.. హీరో రానాకు మధ్య అప్పట్లో కోల్డ్ వార్ జరిగిందని, దానికి కారణం ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మహేష్ బాబు ఎదుగుతున్న సమయంలో సైనికుడు చిత్రానికి రానా వీఎఫ్‌ఎక్స్ డిజైనర్‌‌గా పనిచేసేవాడు. అలా ఎన్నో సినిమాలకు రానా వీఎఫ్ఎక్స్ అందించారు. అయితే సైనికుడు మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. కానీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ మూవీ ఫ్లాప్ అవ్వడానికి కారణం వీఎఫ్‌ఎక్సే కారణమని, రానాదే తప్పు అన్నట్లు మహేశ్ బాబు మాట్లాడారట.

అప్పటి నుంచి వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంకా బాగా తీయగలడు అంటూ మహేష్ సెటైర్ వేశారట. ‘‘మీలాంటి హీరోలు ఈ సినిమాలో ఉంటే మంచి ఔట్‌పుట్ వస్తుంది. టాలీవుడ్‌లో సింక్ సౌండ్ టెక్నాలజీని నేర్చుకోవాలి. డబ్బింగ్ సిస్టంను తీసి పారేయాలి అంటూ మాట్లాడితే అసలు ముందుగా టాలీవుడ్‌లో తెలుగు నేర్పే కోచింగ్ సెంటర్లను ప్రారంభించాలి. పరిశ్రమలో చాలామందికి తెలుగు మాట్లాడడమే రావడం లేదు. అంటూ రానా వెటకారంగా కౌంటర్ వేశారట.

Read More: Iswarya Menon : హాట్ అందాలతో మతి పోగొడుతున్న ఐశ్వ‌ర్య మీన‌న్‌

Advertisement

Next Story