- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'గబ్బర్ సింగ్' కు రెమ్యూనరేషన్ అనుకున్నంత ఇవ్వలేదు: Pawan Kalyan

దిశ, సినిమా: స్టార్ హీరో పవన్ కల్యాణ్ తన రెమ్యునరేషన్‌పై ఓపెన్ అయ్యాడు. తాజాగా బాలయ్య హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్' షోకు హాజరైన ఆయన.. తన పర్సనల్ అండ్ కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలపై స్పందించాడు. ఈ క్రమంలోనే ఎప్పటి నుంచో హాట్ టాపిక్‌గా మారిన ఆయన పారితోషికంపై క్లారిటీ ఇచ్చినా ఫిగర్ మాత్రం చెప్పలేదు. అయితే 'తొలి ప్రేమ' సినిమాకు మాత్రం ఒక్కపైసా తీసుకోలేదని చెప్పాడు. ఆ చిత్రానికి అనుకున్నదానికంటే బడ్జెట్ ఎక్కువ కావడంతో నిర్మాతలు తర్వాత ఇస్తామని చెప్పి వంద రోజుల ఫంక్షన్ అయ్యాక కొంత ఇచ్చారన్నాడు. అలాగే 'గబ్బర్ సింగ్'కు ఇచ్చారా? లేదా? ఎంత ఇచ్చారు? అని బాలయ్య అడగగా.. 'హా ఇచ్చాడు. కానీ, వాళ్లు అనుకున్నంతే ఇచ్చారు. నేను అనుకున్నంతగా కాదు' అని చెప్పాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆ సినిమా నిర్మాత బండ్ల గణేష్‌ను సోషల్ మీడియా వేదికగా ఆడేసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి : మై నేమ్ ఈజ్ ఖాన్.. ఐయామ్ నాట్ ఏ టెర్రరిస్ట్: పాలో ట్వీట్ వైరల్