- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Kannappa: ‘కన్నప్ప’ మూవీలో శివుడిగా స్టార్ హీరో.. అంచనాలను పెంచుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ రాబోతున్న కన్నప్ప సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి స్టార్స్ కీలక పాత్రలో నటించనున్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక మూవీ డిసెంబర్‌లో థియేటర్స్‌లోకి రాబోతుంది.
ఈ క్రమంలో.. మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ప్రతి సోమవారం ఓ క్యారెక్టర్ రివీల్ చేస్తూ కన్నప్ప మూవీపై అంచనాలను పెంచేస్తున్నారు. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన మధుబాల, దేవరాజ్, సంపత్ రామ్, శరత్ కుమార్, అవ్రామ్ నటీనటుల పోస్టర్లు విడుదలయ్యాయి. తాజాగా, కన్నప్ప మేకర్స్ నేడు స్టార్ హీరో అక్షయ్ కుమార్ పుట్టిన రోజు కావడంతో ‘కన్నప్ప’ నుంచి ఆయనకు సంబంధించిన క్యారక్టర్‌ను రివీల్ చేశారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా ట్విట్టర్ వేదికగా మంచు విష్ణు షేర్ చేయడంతో అంచనాలు డబుల్ అయ్యాయి.
పోస్టర్‌లో చేతికి రుద్రాక్ష మా ధరించిన ఫొటోను రిలీజ్ చేయడంతో ఇందులో అక్షయ్ శివుడి పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారింది. అయితే ఇందులో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్న వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. కన్నప్ప టీమ్ అక్షయ్ కుమార్ పోస్టర్ విడుదల చేయడంతో డార్లింగ్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరి ప్రభాస్ ఏ క్యారెక్టర్ చేస్తున్నాడో రివీల్ చేయాలని నెట్టింట పోస్టులు పెడుతున్నారు.